అహ్మద్ రజా ఖాన్
వికీపీడియా నుండి
ఇస్లామీయ పండితుడు మధ్యయుగము |
|
---|---|
పేరు: | అహ్మద్ రజా ఖాన్ |
జననం: | 1856 |
మరణం: | 1921 |
సిద్ధాంతం / సంప్రదాయం: | సున్నీ ముస్లిం |
ముఖ్య వ్యాపకాలు: | అఖీదాహ్, ఫిఖహ్, తసవ్వుఫ్ |
అహ్మద్ రజా ఖాన్, Ahmad Raza Khan, ఒక సున్నీ ముస్లిం, సూఫీ, బరేల్వీ, ముస్లిం పండితుడు. బరేలీకి చెందినవాడు. ఇతను ఇస్లామీయ ధార్మిక శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అహలె సున్నత్ వల్-జమాత్ ను స్థాపించాడు. ఇతను 52 శాస్త్రాలలో నిష్ణాతుడు. మహా రచయితకూడా, దాదాపు 1000 పుస్తకాలు, మోనోగ్రాఫ్ లు రచించాడు. ఇతను అరబ్బీ, పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో వ్రాయగల మహాపండితుడు. ఇతను హనఫీ పాఠశాల అవలంబీకుడు. ఇతను వ్రాసిన నలభై సంపుటాలు గల గ్రంథం "ఫతావా రిజవియ్యా", ప్రాశస్తం పొందినది.
విషయ సూచిక |
[మార్చు] జీవిత చరిత్ర
[మార్చు] తన కుటుంబం మరియు బాల్యం
.
అహ్మద్ రజా ఖాన్ 1272 హి.శ. (1856 క్రీ.శ.) ఉలేమాల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి, మౌలానా నఖీ అలీ ఖాన్, సమకాలీన ఆలిమ్. ఇతని తల్లి ఇతనికి 'అమ్మన్ మియాఁ' అనే పేరు పెట్టింది. తన తండ్రిదగ్గర ఇస్లామీయ ధర్మ శాస్త్రాలు క్షుణ్ణంగా చదివాడు. తన తండ్రి ఆధ్వర్యంలో 'దర్స్-ఎ-నిజామీ' చదివాడు. తన సాధారణ విద్య కొరకు ఏ దారుల్ ఉలూమ్ లోనూ చదవలేదు.
[మార్చు] యౌవనం మరియు ఇతని మినిస్ట్రీ
తన 14వ యేటనే ముఫ్తీ అయ్యాడు. ఇలా తన ఇస్లామీయ ధార్మిక జీవనాన్ని ప్రారంభించి, అహలె సున్నత్ వల్-జమాత్ ను స్థాపించేవరకు వెళ్ళింది. భారతదేశంలో గల ఎన్నో పీర్లు (ధార్మిక పురుషులు) ఇతనిపట్ల ముగ్దులై, తమ మార్గదర్శకునిగా చేసుకున్నారు.
[మార్చు] యౌవనం
తన 21 యేట సూఫీ మార్గాలను అనుసరించి, పటుత్వం పొంది, ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. 22వ యేట తన తండ్రితో కలసి హజ్ యాత్రను పూర్తిచేశాడు. ఎందరో శిష్యగణాన్ని పొందాడు.
అహ్మద్ రజా ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేశాడు, ఫిఖహ్ లో అందెవేసిన చేయి. హనఫీ పాఠశాల అవలంబీకుడు. మక్కా నగర ముఫ్తీ యైన షేక్ అబ్దుర్ రహిమాన్ అస్-సిరాజ్ ఇబ్న్ అబ్దుల్లా అస్-సిరాజ్ కూడా ఇతనిని ముఫ్తీగా గుర్తింపునిచ్చాడు. ఇతను ఖాదరియా సిల్ సిలా కు చెందిన సూఫీ. 1904 లో 'మన్జర్ అల్-ఇస్లాం' అనునొక మదరసా ను స్థాపించాడు. రజా హి.శ. 1340 (1921) లో తన 65వ యేట మరణించాడు.
[మార్చు] తన కార్యక్రమాలు
[మార్చు] మదరసా స్థాపన
దారుల్ ఉలూమ్ మన్‌జర్ ఎ ఇస్లాం అనే పేరుతో ఉత్తరప్రదేశ్ లోని బరేలీ లో ఓ మదరసా స్థాపించాడు.
[మార్చు] రచనలు
అహ్మద్ రజా ఖాన్ దాదాపు 1000 వరకు పుస్తకాలు, మోనోగ్రాఫ్ లు వ్రాశాడు. అరబ్బీ, పర్షియన్ మరియు ఉర్దూలో కవితలు గూడా వ్రాశాడు. ఇందులో ప్రముఖమైనవి కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- 'కన్జలుల్ ఈమాన్, ఫీ తర్జుమాతుల్ ఖురాన్', ఇది ఇతని "ఖురాన్ యొక్క ఉర్దూ తర్జుమా".
- 'Ĥadāyiq e Bakh’shish (Gardens of Salvation) - ఇవి కవితల సంగ్రహం, ఇవి ఉర్దూ మరియు పర్షియన్ లో గలవు, ఈ కవితలన్నీ నాత్-ఎ-షరీఫ్ లు.
- అల్ అతాయా అన్-నబవియ్య అర్-రిజవియ్య (దీనిని ఫతవా అర్-రిజవియ్య), ప్రాశస్తం పొందినది.
- అల్ దావతుల్ మక్కియ్యా (మక్కా ఖజానా).
- హుసాముల్ హరమైన్[1]
కొన్ని ముఖ్యమైన రచనలు : 1. ఫతావా రజ్వియా (12 సంపుటాలు) 2. హుసాముల్ హరమైన 3. ఫతావా హరమైన్ 4. అద్-దౌలతుల్ మక్కియా 5. ఫతావా ఆఫ్రికా 6. అహ్ కామె షరీయత్ 7. సుభానుస్ సుబూహ్ 8. అల్-అమన్ ఒ-వల్-ఔలా 9. దవాముల్ ఐష్ 10. సల్తనత్ ఎ ముస్త్తఫా 11. కిల్ ఫుల్ ఫకీహిల్ ఫహీమ్ 12. అల్ సమ్ సామ్
[మార్చు] గులాం అహ్మద్ కు వ్యతిరేకంగా ఉద్యమం
ఆ కాలంలో మిర్జా గులాం అహ్మద్ అనే ఒక ఖాదియాన్ తనకు తాను ఒక ప్రవక్తగా ప్రకటించుకొన్న కాలం. ఇస్లామీయ ప్రపంచంలో ఇదో సంచలనాత్మక ఘటన. మిర్జా గులాం అహ్మద్, ఓ ఫిత్నా, ఈతను ముస్లింలలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించినపుడు, అతనికి మరియు అతని అసంబద్ధ సిద్ధాంతానికి వ్యతిరేకంగా గళం విప్పిన ధీరుడు. ఈ ఫిత్నాను అణచివేయడంలో తన పాత్రను అమోఘంగా పోషించాడు.[2].
|
|
---|---|
ఇస్లాం · అల్లాహ్ · ముహమ్మద్ · ఖోరాన్ · మలాయిక · ప్రవక్తలు · మక్కా · మదీనా · రాషిదూన్ ఖలీఫాలు · ఖిలాఫత్ · ఖలీఫా · మస్జిద్-అల్-హరామ్ · మస్జిద్-ఎ-నబవి · బైతుల్-ముఖద్దస్ · ఇస్లామీయ స్వర్ణయుగం · ముస్లింల పవిత్ర స్థలాలు · కాబా · మస్జిద్ · హిజ్రత్ · ముస్లింల పండుగలు · ఇస్లామీయ కేలండర్ · · సున్నీ ఇస్లాం · షరియా · హదీసులు · సున్నహ్ · ఈద్గాహ్ · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్ల జాబితా · ముస్లిం పండితులు · ఇస్లామిక్ దేశాలు · ముస్లిం శాస్త్రవేత్తలు · ముస్లింల సాంప్రదాయాలు · యౌమ్-అల్-ఖియామ · కాఫిర్ · మోమిన్ · ఖిబ్లా · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా · భారతదేశంలో ఇస్లాం సూఫీ తత్వము · ఔలియాలు · సూఫీలు · |
[మార్చు] మూలాలు
- Baraka, A - A Saviour in a Dark World (Article) The Islamic Times, March 2003 Stockport, UK
Haroon, M The World of Importance of Imam Ahmad Raza Kazi Publications, Lahore 1974
- Sanyal, Usha, Ahmad Riza Khan Barelwi: In the Path of the Prophet(Makers of the Muslim World), Oneworld, 2005.
[మార్చు] ఇవీ చూడండి
- బరేల్వీ
- తాహిరుల్ ఖాద్రి
- సూఫీలు
- ముస్లిం పండితులు
[మార్చు] బయటి లింకులు
- Sunni News/ సున్నీ న్యూస్
- ఆలా హజ్రత్ గురించి 'విజ్ఞాన సర్వస్వం'.
- The Life and Works of the Muslim Revivalist, A'La Hadrat
- ఆలా హజ్రత్ పై పరిశోధన.
- ఆలా హజ్రత్ ఖురాన్ ను ఉర్దూలో తర్జుమా చేశారు.
- ఆలా హజ్రత్ గ్రంధాలు
- Online Books and Works of Imam Ahmed Rida Khan
- ఆలా హజ్రత్ గారి కృషి మరియు ఫత్వాలు.
- ఆలా హజ్రత్ గారి 'సలామ్' లు.
- Audio Recitation of Al-Quran with English and Urdu Translations by Imam Ahmed Rida Khan
- A detailed website about the Imam's life and works/ ఆలా హజ్రత్ జీవితం మరియు కృషి.
- and Works.htm.com Research work at Sounth Africa on the works of Ahmed Raza Khan.
- దావతె ఇస్లామీ
- Hadaiq-e-bakhshish, Beautiful naats written by Imam Ahmad Raza Khan.
- Imam Ahmed Raza and safeguarding Salah
- Maslak E Ala Hazrat- The Right Faith
- Life and services of Imam Ahmed Raza Khan
- Hazrat Ghazal-e-Zaman Allama Kazmi Sahib