షానామా
వికీపీడియా నుండి
షానామా లేదా షాహ్ నామా (Persian: شاهنامه ) "అత్యున్నత గ్రంథం", పర్షియన్ కవి ఫిరదౌసి 1000వ సంవత్సరపు ప్రాంతంలో రచించిన మహోన్నతమైన కావ్యము, పార్శీ ప్రపంచపు జాతీయ ఇతిహాసము. షానామా ప్రపంచ సృష్టి నుండి 7వ శతాబ్దములో ఇరాన్ పై ముస్లింల విజయం వరకు ఇరాన్ యొక్క పౌరాణిక మరియు చారిత్రక గతాన్ని కావ్యరూపంలో చెబుతుంది.