చరణ్ సింగ్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. |
చౌధరీ చరణ్ సింగ్ | |
భారతదేశ 6వ ప్రధానమంత్రి
|
|
---|---|
In office జూలై 28, 1979 – జనవరి 14, 1980 |
|
Preceded by | మెరార్జీ దేశాయి |
Succeeded by | ఇందిరా గాంధీ |
|
|
జననం | డిసెంబర్ 23, 1902 నూర్‌పూర్, ఉత్తర ప్రదేశ్, బ్రిటీషు ఇండియా |
మరణం | మే 29, 1987 |
రాజకీయ పార్టీ | జనతా పార్టీ |
భార్య/భర్త | గాయత్రీ దేవి |
చౌధరీ చరణ్ సింగ్ 1902 సంవత్సరములో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ లో జన్మించాడు. 1923లో సైన్సులో పట్టా పుచ్చుకొని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన ఆ తరువాత న్యాయవిద్య అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించాడు. 1929లో మీరట్ కి చేరి ఆ తదనంతరం కాంగ్రేసు పార్టీలో చేరాడు.
1937లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నుండి ఎన్నికై ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962 మరియు 1967 లలో ప్రాతినిధ్యం వహించాడు. 1946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శియై రెవిన్యూ, ఆరోగ్య మరియు సాంఘీక పరిశుభ్రత, న్యాయ, సమాచర శాఖలలో పనిచేశాడు. 1951 జూన్ లో రాష్త్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ మరియు సమాచార శాఖ మంత్రిగా ఆ తరువాత 1952లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవిన్యూ మరియు వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1959 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
చరణ్‌సింగ్ 1960లో హోమ్ మరియు వ్యవసాయశాఖా మంత్రిగా, 1962-63లో వ్యవసాయ మరియు అటవీ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కాంగ్రేసు పార్టీ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రేసు మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ దఫా ముఖ్యమంత్రయ్యాడు. కానీ 1970 అక్టోబర్ 2 న ఈయన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించబడినది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్‌సింగ్ భూసంస్కరణలు చేపట్టాడు. 1960 లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకునివచ్చాడు.
1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలములో లోక్‌సభ ఎన్నడూ సమావేశం కాలేదు. లోక్ సభ సమావేశం ప్రారంభమవుతుందనగా, ముందురోజు ఈయన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన కాంగ్రేసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్‌దళ్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ పదవికి రాజీనామా చేశాడు. 6 నెలల అనంతరం లోక్‌సభకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.
ఇంతకు ముందు ఉన్నవారు: మొరార్జీ దేశాయ్ |
భారత ప్రధానమంత్రి జూలై 28, 1979—జనవరి 14, 1980 |
తరువాత వచ్చినవారు: ఇందిరా గాంధీ |
|
---|
సర్దార్ వల్లభభాయి పటేల్ • మురార్జీ దేశాయ్ • చరణ్ సింగ్ • జగ్జీవన్ రాం • యశ్వంత్రావ్ చవాన్ • దేవీలాల్ • లాల్ కృష్ణ అద్వానీ |